Namaste NRI

కాంగ్రెస్‌తో తెలంగాణకు తీవ్ర నష్టం  : నాగేందర్‌ రెడ్డి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాగేందర్‌ రెడ్డి  మాట్లాడుతూ  కేవలం రాజకీయ కక్ష్యలతోనే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అసలు కుంభకోణమే జరగలేదని అన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ,  అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేటీఆర్‌పై అక్రమ కేసులను ప్రజలు ఆమోదించరని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి పథంలో మరో మైలు రాయిగా నిలిచిన ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ మీద కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్‌ రేసింగ్ వల్ల హైదరాబాద్‌ నగరానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచాయని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ తమ స్వలాభం కోసం ఈ విజయాన్ని చెరిపివేయాలని కుట్ర పన్నిందని విమర్శించారు. కాంగ్రెస్‌ కుట్రలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News