ప్రిన్స్, నరేశ్ అగస్త్య, నేహా కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కలి. శివశేషు దర్శకత్వం. లీలాగౌతమ్ వర్మ నిర్మించారు. సినిమా ఈ నెల నాలుగున విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. మనిషి ఎదుగుదలను సరికొత్తగా చూపించే ప్రయత్నం ఇది అని దర్శకుడు శివశేషు అన్నారు.