ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కెఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యదర్శి కె అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కార్యదర్శి కె. అమ్మిరాజు, కోశాధికారి వి సురేష్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఉమర్జీ అనురాధ తదితర మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్లు, యూనియన్లు నందమూరి బాలకృష్ణని కలసి ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.వారంతా కలిసి త్వరలో నందమూరి బాలకృష్ణని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు.