Namaste NRI

తెలుగు భాష.. సంస్కృతిని చాటి చెప్పే చిత్రం :  వైవీఎస్‌ చౌదరి

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ తనయుడు నందమూరి తారకరామారావుని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో యలమంచిలి గీత ఓ చిత్రాన్ని నిర్మించనున్నది. తెలుగ మ్మాయి వీణారావ్‌ కథానాయిక. తెలుగుభాష దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో వైవీఎస్‌ చౌదరి మాట్లాడారు. సినిమా కథానేపథ్యాన్ని ప్రకటించడం కోసమే తెలుగు భాషాదినోత్సవం రోజైన ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశాం. 1980 టైమ్‌లో జరిగే కథ ఇది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యాల్లో ఈ కథ నడుస్తుంది. అందుకని మేం సందేశాలివ్వడంలేదు. కావాల్సిన న్ని వాణిజ్య విలువలు ఉంటాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలను, భావోద్వేగాలను పద్యరూపంలో కూడా ప్రకటించడం జరుగుతుంది. తెలుగు భాషకు మేం ఇస్తున్న ఓ జ్ఞాపిక లాంటి సినిమా ఇది. త్వరలోనే మా చిత్ర కథానాయకుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తాం అని చెప్పారు.

ఇంకా ఈ చిత్ర గీత రచయిత చంద్రబోస్‌, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, నిర్మాత యలమంచిలి గీత, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రమేశ్‌ అత్తిలి కూడా మాట్లాడారు. త్వరలో షూటింగ్‌ మొదలుకానున్న ఈ చిత్రాని కి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణం: న్యూ టాలెంట్‌ రోర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress