చైనా, తైవాన్‌ల మధ్య నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా సైన్యం తైవాన్ సరిహద్దులోకి చొరబడేందుకు ప్రయత్నించింది. తైవాన్ సైన్యం సైతం స్పందించింది. తమ సరిహద్దుల్లోకి చైనా నేవీకి చెంది 27 యుద్ధనౌకలు, 62 విమానాలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 47 చైనా విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటి, తైవాన్ నైరుతి, ఆగ్నేయ, తూర్పు ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్స్ లోకి ప్రవేశించాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ జలసంధి చైనా, తైవాన్ మధ్య అనధికారిక సరిహద్దు. తైవాన్ చుట్టూ 62 చైనా సైనిక విమానాలు, 27 నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది మాత్రమే కాదు, 47 చైనీస్ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటి తైవాన్ నైరుతి, ఆగ్నేయ, తూర్పు వైమానిక రక్షణ గుర్తింపు జోన్లలో ప్రవేశించాయి. దీనికి స్పందించిన తైవాన్ చైనా కార్యకలాపాలను పరిశీలించేందుకు విమానాలు, నౌకాదళ నౌకలు, వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలను మోహరించింది.