Namaste NRI

కొలంబియాలో ఉద్రిక్తత వాతావరణం.. అధ్యక్ష అభ్యర్థిపై

కొలంబియా అధ్యక్ష అభ్యర్థి, సెనేటర్‌ మిగ్యుల్‌ ఉరిబ్‌ (39)పై కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రభుత్వం, ఆయన పార్టీ, స్థానిక మీడియా నివేదించాయి. రాజధానిలోని ఫోంటిబాన్‌ పరిసరాల్లోని పబ్లిక్‌ పార్కులో మిగ్యులే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఒక దుండగుడు ఆయనపై వెనక నుంచి కాల్పులు జరిపాడు. మిగ్యుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై విచారణ చేపడుతున్నట్టు కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్‌ తెలిపారు. ఒక అనుమానితుడిని అరెస్ట్‌ చేశామని అన్నారు.ఈ హింసాత్మక దాడిని నిప్పాక్షికంగా, తీవ్రంగా ఖండిస్తున్నట్టు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగ్యుల్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సమగ్ర దర్యాప్తునకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది కొలంబియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా మిగ్యుల్‌ పోటీ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News