విశాల్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం మార్క్ ఆంథోనీ. అథిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్‌కుమార్ అందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో విశాల్ మాట్లాడుతూ ప్రేక్షకుడి టికెట్ డబ్బులకు సరిపడా వినోదాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఎస్.జె.సూర్యతో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం. దర్శకుడు అథిక్ ఈ కథ నేరేట్ చేసినప్పుడు హిట్ సినిమా అని అర్థమైపోయింది. ఈ సినిమాకు తెగిన ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయిని రైతులకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా చూడనివాళ్లుంటే థియేటర్లో చూడండి అన్నారు.
ఎస్.జె.సూర్య మాట్లాడుతూ విశాల్ తెరపైనే కాదు. రియల్‌గా కూడా హీరోనే. ఆయన సేవా కార్యక్రమాలే అందుకు నిదర్శనం. ఇందులో విశాల్ పాత్రకు సమానమైన పాత్ర నాది. అంతపెద్ద స్టార్ అయ్యుండి నాదిసమానమైన పాత్రైనా ఆయన ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అన్నారు. ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన విశాల్‌కీ, అడిగిందల్లా కాదనకుండా ఇచ్చిన నిర్మాతకు నా కృతజ్ఞతలు అని అన్నారు.