Namaste NRI

ఆ ఒక్కటీ అడక్కు ఆ లోటు తీరుస్తుంది

అల్లరి నరేశ్‌ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆ ఒక్కటీ అడక్కు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్‌ చిలక నిర్మాత. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల వేడుకకు అతిథిగా విచ్చేసిన నాని, ట్రైలర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడు తూ నరేశ్‌ అద్భుతమైన నటుడు. తను వరుసగా కామెడీ సినిమాలు చేస్తుంటే, వాటికి కొంచెం బ్రేక్‌ ఇవ్వమని నేనే కోరాను. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్‌ చూస్తుంటే, బ్రేక్‌ వల్ల తన కామెడీ మిస్‌ అయ్యానని అనిపించింది. ఆ ఒక్కటీ అడక్కు నరేశ్‌ నాన్నగారైన ఈవీవీ సత్యనారాయణగారి టైటిల్‌. దానివల్ల స్పెషల్‌ కనెక్షన్‌ కామన్‌గా ఉంటుంది. అందరూ హాయిగా ఎంజాయ్‌ చేసే సినిమా ఇదని ట్రైలర్‌ చెప్పకనే చెబుతోంది. మే 3న నరేశ్‌తో కలిసి సినిమా చూస్తాను అని అన్నారు.

 49సార్లు వివిధ అమ్మాయిలచే తిరస్కరణకు గురైన అబ్బాయి కథ ఇది.మ్యారేజ్‌ బ్యూరోలు సైతం అతనికి తగిన జోడీని వెతకే విషయంలో విఫలమైన నేపథ్యంలో అనుకోకుండా ఆ కుర్రాడు ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అయితే, తన రిలేషన్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లడానికి వారికి ఓ సమస్య వచ్చిపడుతుంది. అదేంటి? అనేది ఈ సినిమా కథ అని దర్శకుడు తెలిపారు. చాలారోజుల తర్వాత కామెడీ సినిమాతో వస్తున్నాననీ, తప్పకుండా అందర్నీ నవ్విస్తానని అల్లరి నరేశ్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులం దరూ మాట్లాడారు. వెన్నెల కిశోర్‌, జామీ లివర్‌, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: గోపీసుందర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events