భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను అమెరికా పాత్ర లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా సరే ఆ దేశం మాత్రం అంగీకరించడం లేదు. దాయాది దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే అంటున్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు అమెరికా సెక్రటరీ మార్కో రూబియో సైతం ఆయనకు వత్తాసు పలికారు. భారత్, పాకిస్థాన్‌పై అమెరికా ప్రతిరోజూ ఓ కన్నేసి ఉంచుతుందని తెలిపారు.

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉంది. ఇరుదేశాలను అణుయుద్ధానికి వెళ్లకుండా అడ్డుకున్నాం. పరస్పర దాడుల సమయంలో ఇరుదేశాలను నియంత్రించడం మాకు సవాల్‌గా, ఎంతో కష్టంగా మారింది. అందుకే, భారత్, పాక్‌లు ఎటువంటి చర్యలకు సిద్దమవుతున్నాయో తెలుసుకునేందుకు అమెరికా ప్రతిరోజు దాయాది దేశాలపై ఓ కన్నేసి ఉంచింది అని రూబియో వెల్లడించారు.
















