మొగలి రేకులు ఫేమ్ ఆర్‌కె సాగర్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ది 100. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మిషా నారంగ్, ధన్యబాలకృష్ణ, గిరిధర్, ఆనంద్ నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను అగ్ర నటుడు చిరంజీవి మాతృమూర్తి కొణిదెల అంజనా దేవి విడుదల చేశారు. టీజర్‌లో ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాత్రలో కనిపించారు ఆర్‌కె సాగర్. తాను విధులు నిర్వర్తిస్తున్న చోట ఎలాంటి నేరాలు జరగకుండా చూసే నిజాయతీ గల పోలీస్ అధికారిగా ఆర్‌కె సాగర్ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగింది.యాక్షన్ ఘట్టా లు ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్‌రామ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్.