చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. త్రిష కృష్ణన్ కథానాయిక. దర్శకుడు వశిష్ఠ. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత 26 రోజులుగా హైదరాబాద్‌లో నిరవధికంగా జరుగుతున్నది. టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన భారీ సెట్‌లో స్టంట్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలువను న్నాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ ఫైట్ కోసం చిరంజీవి 26 రోజులు కేటాయించారు. ఆయన కెరీర్‌లో ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని రోజులు కేటాయించడం ఇదే ప్రధమం. ఈ షూట్ సోమవారంతో పూర్తయింది. మాస్‌ని మెస్మరైజ్ చేసేలా మెగా లెవల్లో ఈ ఫైట్ ఉండనుందని చిత్రబృదం తెలిపింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు.