
పదమూడేళ్ల క్రితం విడుదలైన అందాల రాక్షసి చిత్రం హృద్యమైన ప్రేమకథగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. నవీన్‌చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్.రాజమౌళి నిర్మించారు. ఈ సినిమా ద్వారానే లావణ్య త్రిపాఠి కథానాయికగా తెలుగులో అరంగేట్రం చేసింది. విభిన్నమైన ప్రేమకథగా, మనసునుని కట్టిపడేసే భావోద్వేగాలతో ఈ సినిమా మెప్పించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 13న రీరిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీని మరలా బిగ్‌స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశమిదని నిర్మాతలు పేర్కొన్నారు.
