స్టార్ హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మిస్టర్ ఎక్స్. అనఘ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకుడు. లక్ష్మణ్ కుమార్ నిర్మాత. ప్రముఖ నటి మంజు వారియర్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ఇండియాతో పాటు ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరణ చేస్తాం. స్టంట్ సెల్వా యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు అన్నారు. ధిబు నినాస్ థామస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.


