Namaste NRI

ఈ సినిమాకు వచ్చిన బజ్‌ చూస్తుంటే భయం వేస్తోంది

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌ ఓదెల 2. అశోక్‌తేజ దర్శకుడు. సంపత్‌నంది దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ,  డి.మధుతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్‌ అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.  ఈ సందర్భంగా తమన్నా మాట్లాడారు. శివశక్తి పాత్ర, ఓదెల 2  సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్‌. 20ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్‌లో పనిచేశా. కానీ ఇంత పాషన్‌ వున్న ప్రొడ్యూసర్స్‌ని, క్రియేటర్స్‌ని చూడలేదు. ఇలాంటి టీమ్‌ అరుదుగా దొరుకుతుంది. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. 17వ తేదీ కోసం అందరితోపాటు నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నా అని అన్నారు.

ఈ సినిమాకు వచ్చిన బజ్‌ చూస్తుంటే భయం వేస్తోంది. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌కీ, రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కీ థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా. ఈ సినిమా కోసం ఓ రీసెర్చే జరిగింది. ఎన్నో పుస్తకాలను రిఫర్‌ చేశాం. డైరెక్టర్‌ అశోక్‌ వెరీ పాజిటీవ్‌ సోల్‌. అతనికి మంచి జరగాలనే ఓదెల 2 స్టార్ట్‌ చేశా.  సౌందర్‌ రాజన్‌ విజువల్స్‌, అజనీష్‌ నేపథ్య సంగీతం ఈ సినిమాను హైలైట్స్‌. ఓ గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది అని సంపత్‌నంది తెలిపారు. ఇంకా నిర్మాత డి.మధు, దర్శకుడు అశోక్‌తేజ, నిర్మాత రాధామోహన్‌, నటుడు వశిష్ట ఎన్‌.సింహా, ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ నాయర్‌లతోపాటు మరో అతిథి దర్శకుడు వశిష్ట కూడా మాట్లాడారు.  ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events