Namaste NRI

అమెరికాతో  ఆ ఒప్పందం…నిలిపివేసే యోచన లేదన్న కేంద్రం

అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రక్షణశాఖకు చెందిన ఆయుధాల సేకరణపై యథాతథ స్థితి కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఒప్పందాల మేరకు అమెరికా ఆయుధాల సరఫరా భారత్‌కు కొనసాగుతుందని, తదుపరి కొనుగోళ్లపై చర్చలు కూడా కొనసాగుతాయని అవి వెల్లడించాయి.

అమెరికాతో రక్షణ కొనుగోళ్లను భారత్‌ నిలిపివేసినట్లు రాయిటర్స్‌ నుంచి వెలువడిన కథనాన్ని రక్షణ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఖండించారు. భారీ సుంకాల విధింపు వేళ భారత్‌, అమెరికా మధ్య రక్షణ సంబంధాలపై దీని ప్రత్యక్ష ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని ఐడీ ర్రోన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పధి అభిప్రాయపడ్డారు.

Social Share Spread Message

Latest News