ఈ పెయింటింగ్ రాబోయే ఒక వేలంలో 1650 కోట్ల రూపాయలకుపైగా పలకబోతున్నదని వేలం సంస్థ క్రిస్టీస్ వెల్లడించింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన చిత్రం ఇది. ఇందులో కనిపిస్తున్న మహిళ అమెరికన్ ఫొటో జర్నలిస్ట్ లీ మిల్లర్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వోగ్ పత్రికకు ప్రతినిధిగా పనిచేసి గొప్ప పేరు గడించారు. లార్‌లెస్సియెన్‌గా పిలిచే ఈ చిత్రాన్ని 1937లో గీశాడు పికాసో. మిల్లర్ పికాసోకి దగ్గరి స్నేహితురాలు.
