Namaste NRI

డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి ఖరారు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ ను (60) ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్‌ ఎంపిక చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన మధ్య పశ్చిమ ఎగువ ప్రాంతంలో ఉధృతంగా ప్రచారం చేయాలని హారిస్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన సైనిక వ్యవహారాల అనుభవజ్ఞుడు, తన సొంత రాష్ట్రంలో డెమొక్రటిక్‌ పార్టీ అజెండాను అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వాల్జ్‌ను తన రన్నింగ్‌ మేట్‌ గా హారిస్‌ వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. అమెరికా చట్టసభలో 12 ఏళ్ల పాటు టిమ్‌వాల్ట్ సేవలందించారు. 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యా రు. అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో 20 ఏళ్ల పాటు సేవలందించారు.

Social Share Spread Message

Latest News