శాంతిచంద్ర, దీపికా సింగ్, సిమ్రితి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డర్టీఫెలో. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. జి.యస్.బాబు నిర్మాత. సత్యప్రకాష్, నాగినీడు, జయశ్రీ, సురేంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలోని సందెవేళ అనే పాటను దర్శకుడు సాయిరాజేష్ విడుదల చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. హీరో పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. నేటి యువతరానికి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. త్వరలో విడు దల తేదీని ప్రకటిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, సంగీతం: సతీష్ కుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి.
