Namaste NRI

మాట నూతన కార్యవర్గం ఎన్నిక

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) నూతన కార్యవర్గం కొలువుదీరింది. 2025- 26 సంవత్సరానికి గానూ మొత్తం 250 మంది సభ్యులతో నూతన బోర్డు ఏర్పడింది. డల్లాస్ లో నిర్వహించిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన అధ్యకులు పలువులు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. మాట నూతన అధ్యక్షుడు రమణ కృష్ణ కిరణ్ ప్రమాణ స్వీకారం చేశారు. సమానత్వానికి ప్రతిబింబంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ బబమంత్రాల పఠనం మధ్య రమణ కృష్ణకిరణ్ దుద్దాగి బాధ్యతలు స్వీకరించారు.
మాటా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని, సలహా మండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. మాటా అభివృద్ధి, లక్ష్యాల సాధన కోసం శ్రీనివాస్ గనగోని అనుభవం, మార్గదర్శకత్వం కొనసాగతుందని ఈ సందర్భంగా నూతన బోర్డు తెలిపింది. తెలుగు సమాజ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మాటా సంఘం నూతన నాయకత్వ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తన పదవీకాలంలో మాటా అనూహ్యమైన అభివృద్ధి సాధించి, అనేక సమాజాలకు చేరుకుని అవిస్మరణీయమైన ప్రభావాన్ని చూపిందని ఆయన గుర్తుచేశారు. శ్రీనివాస్ గనగోని సలహా మండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించి, మాటా భవిష్యత్తును మరింత ముందుకు నడిపేందుకు తన అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించనున్నట్టు తెలిపారు.
అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి భవిష్యత్ కార్యాచరణ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఈ పదవీకాలంలో కీలకమైన 5 లక్ష్యాలపై దృష్టి సారిస్తామని ఆయన వివరించారు.
1. సేవ: అమెరికాలోని అన్ని తెలుగు కుటుంబాలకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలను విస్తరించడం.
2. సంస్కృతి: తెలుగు వారసత్వాన్ని కాపాడుతూ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.
3. సమానత్వం: కొత్త ఛాప్టర్లను ప్రారంభించి, సభ్యులకు సమాన అవకాశాలను కల్పించడం.
4. యువశక్తి: యువ నాయకత్వానికి సరైన వేదికలను అందించడం.
5. మహిళా నాయకత్వం: మాటాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం.
ఈ కార్యక్రమంలో మాటా 2026 మహాసభ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇది తెలుగు సంస్కృతి, వ్యాపారం, యువజన నాయకత్వం, మహిళా సాధికారత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రాముఖ్యత కలిగిన సమ్మేళనం కానుంది. అలాగే, ఇదే వేదికపై మాటా ముచ్చట అనే త్రైమాసిక వార్తా పత్రిక ప్రారంభించారు. ఇది సంస్థ విజయాలను, భవిష్యత్తు కార్యక్రమాలను సభ్యులకు తెలియజేస్తుంది.
ఎగ్జిక్యూటివ్ కమిటీ :
ప్రెసిడెంట్ : రమణ కృష్ణ కిరణ్ దుద్దగి, ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ : ప్రవీణ్ గూడురు, సెక్రటరీ: విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్: శ్రీధర్ గూడాల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నగేష్ చిలకపాటి, నేషనల్ కో ఆర్డినేటర్: టోనీ జన్ను, జాయింట్ సెక్రటరీగా రాజ్ ఆనందేషి, ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ డైరెక్టర్ : స్వాతి అట్లూరి, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్: కల్యాణి రెడ్డి బెల్లంకొండ, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ : మహేందర్ నరాల, అడిషనల్ సెక్రటరీ : శ్రీధర్ పెంట్యాల, స్పిరిట్యువల్ మెంబర్షిప్ డైరెక్టర్: శిరీషా గుండపనేని, హెల్త్, వెల్నెస్ డైరెక్టర్ : డాక్టర్ సరస్వతి లక్కసాని, పబ్లిసిటీ పీఆర్ మీడియా : ప్రశాంత్ శ్రీపేరంబుదురు, స్పోర్ట్స్ డైరెక్టర్ : సురేష్ ఖజాన, ఇండియా కో ఆర్డినేటర్ : డాక్టర్ విజయభాస్కర్ బొలగాం.
బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ :
మల్లిక్ బొల్లా, శ్రీనివాస్ తాటిపాములు, శ్రీనివాస్ గండె, ప్రసాద్ వావిలాల, విజయ్ గడ్డం, రామ్ మోహన్ చిన్నాల, బిందు గొంగటి, హరికృష్ణ నరుకుళ్లపాటి, జ్యోతి బాబు అవులు ( జేబీ), బాబా సొంటియాన, రంగ సూరా రెడ్డి, మహేంద్ర గజేంద్ర.
హోనరీర్ అడ్వైజర్స్ :
డాక్టర్ స్టాన్లీ రెడ్డి, దాము గేదెల, ప్రసాద్ కునిశెట్టి, పవన్ దర్శి, జైదీప్ రెడ్డి, శేఖర్ వెంపరాల, డాక్టర్ హరి ఎప్పనపల్లి, ప్రేమ రొద్దం, బాబురావు సామల, వెంకటేష్ ముత్యాల, నందు బలిజ, డాక్టర్ సునీల్ పారిఖ్, అనిల్ గ్రంధి, బాలాజీ జిల్లా, రఘు వీరమల్లు, గంగాధర్ వుప్పల తదితరులు బాధ్యతలు స్వీకరించారు.
ఈ వేడుకలో 250 మందికి పైగా సభ్యులు పాల్గొని కొత్త నాయకత్వ బృందానికి మద్దతు తెలిపారు. మాటా వ్యవస్థాపకులు, సలహా మండలి, గౌరవ సలహాదారులు, కార్యవర్గం, బోర్డు సభ్యులు, ప్రాంతీయ ప్రతినిధులు, మరియు ఇతర నాయకులు హాజరై, ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events