శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్గా నటిస్తున్నారు. కార్తిక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. లవ్ అంటే ఏమాత్రం ఇష్టం లేని పాత్రలో శ్రీవిష్ణు మరోసారి సాలిడ్ ఎంటర్టైన్మెంట్తో రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సింగిల్గా ఉన్నాడంటూ అతని పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడు కమెడియన్ వెన్నెల కిషోర్. అయితే, అతడిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారని ఈ సినిమా కథలోని నేపథ్యాన్ని తెలియజేశాడు. ఇక మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని ఆయన తెలిపినట్లు ఈ వీడియో గ్లింప్స్ ముగించారు. మొత్తానికి శ్రీవిష్ణు ఈ సారి ట్రై యాంగిల్ లవ్ స్టోరీ తో పాటు బోలెడంత ఎంటర్టైన్మెంట్ను కూడా పట్టుకొస్తున్నాడు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)