దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది. చివరిసారిగా జూన్ 25న రష్యా, శ్రీలంక, వియత్నాం అధికారులతో సమావేశం సందర్భంగా కిన్ గాంగ్ కనిపించారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. జర్నలిస్ట్‌తో అఫైర్‌తో మంత్రి ఇటీవల వార్తల్లో నిలిచారు. కిన్ గాంగ్ మిస్ అయి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆయన ఆచూకీపై స్పష్టత లేకపోవడం గమనార్హం.
