పిల్లలపై సామాజిక మాధ్యమాలప్రభావాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా ఓ చట్టం తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు.

పదిహేనేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లుకు ఫ్రాన్స్ దిగువసభలోని శాసనసభ్యులు మద్దతిచ్చారని తెలిపారు. సెనెట్‌లో దీనిపై చర్చలు జరిపి బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్‌కు కేటాయించడంవల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మేక్రాన్ వెల్లడించారు. ఫిబ్రవరి చివరికి సెనెట్ ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియాపై నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.















