Skip to main content

Namaste NRI

శుభవార్త అమెరికాలోనే.. హెచ్1బీ రెన్యువల్

అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలోనే హెచ్1బీ, ఎల్1 వీసాలు రెన్యువల్ చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. కొన్ని నైపుణ్య రంగాల్లో పనిచేసేందుకు విదేశీ నిపుణులను ఆహ్వానించేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్1బీ, ఎల్1 వీసాలు ఇస్తున్నది. ఇవి వలస వీసాలు కావు. వీటి కాలపరిమితి ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలంటే సొంత దేశాలకో, లేదంటే ఏదైనా దేశంలోని అమెరికా కాన్సులేట్‌కు   వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2004 వరకు ఈ వీసాలకు అమెరికాలోనే స్టాంప్‌వేసి  రెన్యువల్ చేసేవారు. ఆ తర్వాత ఆ విధానాన్ని రద్దుచేశారు. తాజాగా మళ్లీ పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని అమెరికా హోంశాఖ తెలిపింది. ఈ నిర్ణయ వేలమంది భారతీయ టెకీలకు ఎంతో మేలు చేస్తుంది.

Social Share Spread Message

Latest News