శాసనసభ ఫేమ్ ఇంద్రసేన్ హీరోగా, జైక్రిష్ ప్రధాన పాత్రలో నిఖిల్.కె.బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇంద్రజాలం. ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం ఇంటర్నేషనల్ ఆర్టిట్రేషన్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆర్. మాధవరావు కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో సినిమా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత నిఖిల్ మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందనున్న ప్రేమకథ ఇది. ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే ఉంటుంది. వినోదానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తిచేస్తాం అన్నారు.
నటుడు జై క్రిష్ మాట్లాడుతూ నేను ఇందులో ముఖ్యమైన పాత్రను చేస్తున్నాను. ఈ అవకాశం రావటానికి కారకులైన సంతోషం సురేష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని ఆశపడుతున్నాను అని అన్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి. అమర్ కుమార్, సంగీతం ఎం.ఎం. కుమార్, ఎడిటర్ చంటి, ప్రొడక్షన్ కంట్రోలర్ భైరవ ఈశ్వర్, పి.ఆర్.ఓ సురేష్ కొండేటి, నిర్మాత, కో ప్రొడ్యూసర్ పూర్ణ శైలజ, నిర్మాత, దర్శకత్వం నిఖిల్ కె. బాల లుగా వ్యవహరిస్తున్నారు.