ప్రఖ్యాత శాస్త్రవేత్త గురుస్వామి రవిచంద్రన్‌ను అత్యున్నత పురస్కారం వరించింది. ఐప్లెడ్ మెకానిక్స్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికిగానూ టిమోషెంకో మెడల్‌ను రవిచంద్రన్ అందుకున్నారు. రవిచంద్రన్ తమిళనాడులో జన్మించారు. అధిక పీడనం, ఒత్తిడికి గురైనప్పుడు లోహాలు, పాలిమర్లు తదితర పదార్థాల ప్రవర్తనపై ఆయన ఎంతోకాలం పాటు పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనల మూలంగా అధిక ఒత్తిడికి గురై విఫలమవుతున్న పదార్థాల స్థానంలో అధిక ఒత్తిడిని తట్టుకునేలా నూతన పదార్థాల ఆవిష్కరణకు మార్గం సుగమం అయింది. ప్రముఖ ఇంజినీర్ స్టీఫెన్ పీ టిమోషెంకో పేరిట 1957 నుంచి ఏటా అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్ రంగంలో ఈ పురస్కారాన్ని అంత్యంత గౌరవ సూచకంగా భావిస్తారు.


