హీరో రామ్‌చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ది ఇండియా హౌస్ కర్ణాటకలోని హంపిలో ఘనంగా ప్రారంభమైంది. వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రామ్‌వంశీ కృష్ణ దర్శకత్వం. హంపిలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు.నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుందని, 1905 బ్యాక్‌డ్రాప్‌లో లవ్, రెవల్యూషనరీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికాను న్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కామెరాన్ బైసన్, ప్రొడక్షన్ డిజైనర్: రజిని, సహనిర్మాత: మయాంక్, రచన-దర్శకత్వం: రామ్ వంశీకృష్ణ.