సుప్రజ్, సంగీర్తన విపిన్ జంటగా, చందురామ్ దర్శకత్వంలో స్వర్ణకమల నిర్మిస్తున్న పయనం చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ క్లాప్ ఇవ్వగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్విచాన్ చేశారు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందనున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని దర్శకుడు చెప్పారు.

జూలై 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, మంచిర్యాల, తమిళనాడు, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. అవసరాల శ్రీనివాస్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆమని, మైమ్ మధు, మెహబూబ్ భాషా తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచనా సహకారం, మాటలు, స్క్రీన్‌ప్లే: వీరారెడ్డి, సతీష్‌కుమార్ మూల, కెమెరా: షోయబ్, సంగీతం: రఘు కుంచె, నిర్మాణం: ఛాయ చిత్రాలు.
