Namaste NRI

లాస్‌ ఏంజిల్స్‌ నాట్స్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌  (నాట్స్‌) చేపడుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లాస్‌ ఏంజిల్స్‌ నాట్స్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.  కొవిడ్‌ మహమ్మారి వల్ల సమావేశం నిర్వహించలేకపోయిన అసోషియేషన్‌, కరోనా ప్రభావం తర్వాత తొలిసారి సమావేశమైంది.  నాట్స్‌ జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌  చిలుకూరి లాస్‌ఏంజిల్స్‌ చాప్టర్‌ నూతన కార్యవర్గాన్ని  సభ్యులకు పరిచయం చేశారు. లాస్‌ ఏంజెల్స్‌ చాప్టర్‌ కో ఆర్డినేటర్‌గా మనోహర రావు మద్దినేని, జాయింట్‌ కో ఆర్డినేటర్‌ మురళీ ముద్దనలు  బాధ్యతలు స్వీకరించారు.  వీరిద్దరి నేతృత్వంలో పనిచేయబోయే బృందాన్ని నాట్స్‌ జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ చిలుకూరి అందరికీ పరిచయం చేశారు.

                         కొవిడ్‌ సమయంలో గత కార్యవర్గం  చేసిన సేవా కార్యక్రమాలు  ప్రశంసనీయమని, అదే స్ఫూర్తితో కొత్త నాయకత్వం పనిచేస్తుందని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. నెలలో ఒకసారి వర్చువల్‌గా, ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఈ సమావేశంలో స్థానిక నాట్స్‌ నాయకులు వెంకట్‌ ఆలపాటి, వంశీ మోహన్‌ గరికపాటి, నాట్స్‌ స్పోర్ట్స్‌ నేషనల్‌ కో ఆర్డినేటర్‌ దిలీప్‌ సూరపనేని, ఈవెంట్స్‌ ఛైర్‌ బిందు కామిశెట్టి, హెల్ప్‌లైన్‌ ఛైర్‌ శంకర్‌ సింగంశెట్టి, స్పోర్ట్స్‌ చైర్‌ కిరణ్‌ ఇమ్మడిశెట్టి, కమ్యూనిటీ సర్వీసెస్‌ చైర్‌ అరుణ బోయినేని, మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ చైర్‌ ప్రభాకర్‌ రెడ్డి పాతకోట,  ఫండ్‌ రైజింగ్‌ ఛైర్‌ గురు కొంక, కో చైర్స్‌, వాలంటీర్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events