సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం దూరదర్శని . కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నా నీడ వెళుతుందా అనే లిరికల్ వీడియోను కార్తీక్ దండు విడుదల చేశారు.

అనురాగ్ కులకర్ణి, సునీత ఆలపించిన ఈ బ్యూటిఫుల్‌సాంగ్‌కు నారాయణ ఆవుల సాహిత్యం అందించారు. ఆనంద్ గుర్రాన బాణీలు సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. తాజాగా విడుదలైన ఈ లిరికల్ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ప్రేమలోని గాఢతను వర్ణించే ఈ సాంగ్‌ను ప్రముఖ నేపథ్య గాయకులు అనురాగ్ కులకర్ణి, సునీత తమ గాత్రంతో ప్రాణం పోశారు. త్వరలోనే విడుదల తేదిని కూడా ప్రకటిస్తాం అన్నారు. సువిక్షిత్ బొజ్జ, గీతిర రతన్, భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్, జి.భాస్కర్, భద్రమ్, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: నారాయాణ ఆవుల, డైలాగ్స్: కాకర్ల చరణ్, లక్ష్మణ్.కె, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జెసుబ్బారెడ్డి, సంగీతం: ఆనంద్ గుర్రాన, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు.
