Namaste NRI

పెద్ది కోసమే మేకోవర్‌ మొదలైంది

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్‌ కథానాయిక. నిర్మాణ సంస్థలు మైత్రీమూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకటసతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.    ఈ సినిమా  షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్ల చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. తదుపరి జరిగే షెడ్యూల్‌ కోసం బీస్ట్‌ లుక్‌లోకి మారిపోయారు రామ్‌చరణ్‌. ఈ సందర్భంగా కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. పెద్ది కోసం మేకోవర్‌ మొదలైంది. ఈ సవాలు కఠినమైనదైనా, ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అని పేర్కొన్నారు. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్ర శక్తిమంతంగా ఉండబోతోంది. జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న చిత్రం విడుదలవుతోంది.

Social Share Spread Message

Latest News