తెలంగాణలో రెండేళ్ల కొక సారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు. దారులన్నీ మేడారం వైపే అన్నట్టు భక్తులు తరలి వస్తున్నారు. మేడారం భక్త జన సంద్రంగా మారింది. . ఈ నెల 31 వరకు జరిగే ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.ఈ సారి జాతరలో కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. చిన్న పిల్లల తప్పి పోకుండా ఈ పరిజ్ఞానంను ఉపయోగిస్తున్నారు. దాదాపు 21 ప్రభుత్వ శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకూ దాదాపు 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా.




















