ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఒక్క దినార్ విలువ 3.25 డాలర్లుగా ఉన్నది. ఈ మేరకు ఫోర్బ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికన్ డాలర్ 10వ ర్యాంకు, ఇండియన్ రూపాయి 15వ స్థానంలో నిలిచాయి. డిమాండ్-సైప్లె, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల పాలసీలు తదితర అంశాలను విశ్లేషించి ఈ ర్యాంకులను కేటాయించారు.