Namaste NRI

ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ : సుహాస్‌

సుహాస్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ప్రసన్నవదనం. అర్జున్‌ కె దర్శకత్వం. ఈ చిత్రాన్ని జేఎస్‌ మణికంఠ, టీ.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సుహాస్‌ మాట్లాడుతూ ఈ సినిమా విజయంపై ఎలాంటి సందేహం లేదు. థౌజండ్‌ పర్సంట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అని నమ్మకంగా చెబతున్నా అన్నారు.   సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఆస్వాదిస్తారని చెప్పారు. ఈ కథలో ఫన్‌, థ్రిల్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయని దర్శకుడు అర్జున్‌ పేర్కొన్నాడు. సమ్మర్‌ ట్రీట్‌లా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నిర్మాత టీఆర్‌ ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events