నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ మేరకు కమలా హారిస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తు లపై సంతకం చేసినట్లు తెలిపారు. నవంబర్‌లో తన ప్రజాశక్తితో కూడిన ప్రచారమే గెలుస్తుందని ఈ సందర్భంగా హారిస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటు ద్వారా గెలిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.