Namaste NRI

మాధవి లోకిరెడ్డి నేతృత్వంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) 2026 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) వారు 2026 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 11 వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో ప్రకటించారు. ఈ సందర్బంగా మాధవి లోకిరెడ్డి సంస్థ అధ్యక్షులుగా పదవీబాధ్యతలు స్వీకరించారు. 1986 లో ప్రారంభించబడి 40 వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఘన చరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సంస్థకు 2026 వ సంవత్సరానికి అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇందుకు కార్య నిర్వాహక బృందము మరియు పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని తెలియజేసారు.

అధికారిక కార్యనిర్వాహక బృందం:

అధ్యక్షులు : మాధవి లోకిరెడ్డి
సంయుక్త కార్యదర్శి : లెనిన్ తుళ్లూరి

ఉత్తరాధ్యక్షుడు: ఉదయ్ కిరణ్ నిడిగంటి
కోశాధికారి: దీప్తి సూర్యదేవర

ఉపాధ్యక్షులు : సునీల్ సూరపరాజు
సంయుక్త కోశాధికారి: లక్ష్మినరసింహ పోపూరి

కార్యదర్శి : LN కోయ
తక్షణ పూర్వాధ్యక్షులు: చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి

దీపికా రెడ్డి, RBS రెడ్డి, శివా రెడ్డి వల్లూరు, రవి కదిరి , అర్పిత ఓబులరెడ్డి, అనిత ముప్పిడి, పార్థ సారథి గొర్ల, శాంతి నూతి, మల్లికార్జున మురారి, పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ, వెంకట్ బొల్లా.

పాలక మండల బృందం:

అధిపతి : దయాకర్ మాడా, ఉపాధిపతి: జ్యోతి వనం, Dr. శ్రీనాధ వట్టం, Dr. శ్రీనాధ రెడ్డి పలవల, రాజా రెడ్డి, ప్రవీణ్ బిల్లా, కల్యాణి తాడిమేటి
కొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో ,సరికొత్త ఆలోచనలతో 2026 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి తెలిపారు.

2025 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి మాట్లాడుతూ మాధవి లోకిరెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన 2026 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ మాధవి లోకిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు- TPAD ఫౌండేషన్ సభ్యులు-అజయ్ రెడ్డి ఏలేటి, రావు కలవల, రఘువీర్ బండారు మరియు జానకిరామ్ మందాడి; TANTEX గత అధ్యక్షులు, డా. NRU & సతీష్ బండారు; శారద సింగిరెడ్డి, 2026 DARA అధ్యక్షులు శివారెడ్డి లేవక మరియు సభ్యులు తిరుమల రెడ్డి కుంభం. 2025 ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు మహేష్ ఆదిభట్ల మరియు TANTEX గత అధ్యక్షులు సుబ్బు జొన్నలగడ్డ మరియు మొత్తం ఎన్నికల కమిటీ బృందానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పత్రికా మరియు టీవీ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events