Namaste NRI

నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం…ఒలింపిక్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం

ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. గతానికి భిన్నంగా ఎలాంటి ఆంక్షలు, నిబంధన లకు తావు లేకుండా స్వేచ్చ, స్వాత్రంత్యానికి ప్రతీకగా పారిస్‌ విశ్వక్రీడల సంబరానికి వేళయైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న పారిస్‌,  ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది.

చారిత్రక ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా 10,500 మంది ప్లేయర్లు పోటీపడుతున్న ఒలింపిక్స్‌లో ఆరంభ వేడుకలు గతాన్ని తలదన్నే విధంగా చేసేందుకు పారిస్‌ ప్రభుత్వం నడుము బిగించింది. సుదీర్ఘమైన సీన్‌ నది పరివాహక ప్రాంతాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రారంభ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ దేశాల ప్లేయర్లకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో పారిస్‌ నగరం క్రీడాభిమానులను అలరించనుంది. ఫ్రెంచ్‌ ప్రముఖ థియేటర్‌ డైరెక్టర్‌ థామ్‌ జాలీ పారిస్‌ నగరాన్ని ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌గా మారుస్తూ కార్యక్రమాల రూపకల్పన చేశారు.

128 ఏండ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పురుష, మహిళా అథ్లెట్లు సమానంగా పోటీపడు తున్నారు. ఈ క్రీడా పండుగలో సుమారుగా 10,500 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతుంటే అందులో సగం మంది మహిళలే కావడం విశేషం. ఒలింపిక్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. 1896లో జరిగిన తొలి ఒలింపిక్స్‌ లో పాల్గొన్న మహిళలు 241 మంది మాత్రమే. 1996 (అట్లంటా) నుంచి మహిళల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగు తోంది. టోక్యోలో మొత్తంగా 11,037 మంది పాల్గొంటే అందులో 47 శాతం మహిళా అథ్లెట్లు కాగా ఇప్పుడు ఆ సంఖ్య 50 శాతానికి చేరింది. అందుకే ఈసారి క్రీడలను లింగ సమానత్వ ఒలింపిక్స్‌ గా పిలుస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events