ఉక్రెయిన్‌కు 95.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీని అందించేందుకు అమెరికా సేనేట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌తో పాటు ఇజ్రాయిల్, తైవాన్‌కు కూడా ఆర్థిక సాయాన్ని అందించనున్నది. సేనేట్ ఆమోదం పొందిన చట్టంపై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేయనున్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఆ బిల్లు పాసైంది. ఆ తర్వాత సేనేట్‌లోనూ ఆమోదం దక్కింది. ఉక్రెయిన్‌కు 61 బిలియన్ల డాలర్లు ఇవ్వనున్నారు. 79-18 ఓట్ల తేడాతో సేనేట్‌లో ఆ ప్యాకేజీకి ఆమోదం దక్కింది. బిల్లుపై సంతకం చేసి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌కు ఈవారంలోనే ఆయుధాలు, ఇతర సామాగ్రిని పంపనున్న ట్లు వెల్లడించారు.