అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే వయసు తనకు అడ్డంకి కాదని బైడెన్ అంటున్నారు. ఆయన తన ప్రత్యర్థి 77 ఏళ్ల ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్‌ను ఆరేళ్ల పిల్లాడిగా అభివర్ణించారు. 2024 ఎన్నికల సన్నాహకాలు జోరు మీద ఉన్నాయి. అవును వయసు కూడా ఒక అంశమే. నేను ఈ ఎన్నికల్లో ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్న పెద్ద మనిషిని అని వ్యాఖ్యానించారు. శృంగాతార స్టార్మీ డేనియల్‌కు సంబందించి ట్రంప్ జరుగుతున్న విచారణపైనా సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం స్టార్మీ వెదర్ (తుపాను)ను తన ప్రత్యర్థి ఎదుర్కొంటున్నారని అన్నారు.