విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్. పరశురాం దర్శకత్వం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఎస్‌వీసీ బ్యానర్ లో వస్తున్న 54వ చిత్రమిది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఫ్యామిలీ స్టార్ విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 05న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. ఇక ఈ పోస్టర్‌లో ఆధార్ కార్డు నోట్లో పెట్టుకుని రేషన్ సరుకుల కోసం పరిగెడుతున్నట్లు విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ లో కుటుంబ బాగోగులు చూసుకునే ఫ్యామిలీ మ్యాన్‌గా, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవకొండ ఇందులో కనిపించనున్నారు. కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్, సంగీతం: గోపీ సుందర్.