రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఓలే ఓలే అనే పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడంతో పాటు రోహిణి సోరట్‌తో కలిసి పాడారు.

రవితేజ, శ్రీలీల జోడి ఈ పాటతో మాస్‌ని మరోసారి ఆకట్టుకుంటుందని, ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరోస్థాయిలో నిలబెట్టారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: విధు అయ్యన్న, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.
















