Namaste NRI

రెండో ఏడాది కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం రెండో ఏడాది నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ మీట నొక్కి 3.27 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు  తెలిపారు. పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని బ్యాంకులకు సూచించామన్నారు. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్ల జమ చేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45`60 ఏళ్ల మద్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events