
అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కు తెరపడింది. అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పలికేందుకు ప్రభుత్వ ఫండింగ్ బిల్లు కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాత్రి సంతకం చేశారు. అంతకు ముందు రిపబ్లికన్ నేతృత్వంలోని ప్రతినిధుల సభలో 222-209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేశారు. దీంతో 43 రోజుల పాటూ సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పడినట్లైంది. మూడు రోజుల క్రితమే ఈ బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.















