
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సింగిల్. కార్తీక్ రాజు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని, ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, ఆద్యంతం హాస్యంతో అలరించే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. కేతికశర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి, రచన-దర్శకత్వం: కార్తీక్‌రాజు.
