Namaste NRI

సంచలనం సృష్టించిన దేఖ్‌లేంగే సాలా సాంగ్

అగ్ర హీరో పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ వేసవి బరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలుపెడుతూ ఇటీవలే దేఖ్‌లేంగే సాలా అనే పాటను విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. సమస్యల్లో ఉన్న యువతకు స్ఫూర్తినిచ్చేలా ఈ గీతానికి రూపకల్పన చేశామని చిత్రబృందం పేర్కొంది.

విడుదలైన 24 గంటల్లో ఈ పాట 29.6 మిలియన్ల వీక్షణలతో కొత్త రికార్డులు సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ పాట వైరల్‌గా మారిందని,  వాణిజ్య అంశాలు కలబోసిన ఈ పాట యువతకు ప్రేరణనిస్తున్నదని, ైస్టెలిష్‌ మేకింగ్‌తో ఆకట్టుకుంటున్నదని మేకర్స్‌ తెలిపారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్‌ ఎస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events