Namaste NRI

అట్టహాసంగా పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం

పారిస్‌ ఒలింపిక్స్‌కు ఒలంపిక్‌ చరిత్రలో  ప్రత్యేక స్థానం దక్కింది. ఎవరూ ఊహించని రీతిలో క్రీడలకు అందరికీ దగ్గరి చేయాలనే తలంపుతో ఆరంభ వేడుకలు వినూత్న రీతిలో అదరగొట్టాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరం వేదికగా మొదల య్యాయి. ఫుట్‌బాలర్‌ జిదానే ఒలింపిక్‌ టార్చ్‌ పట్టుకుని పరిగెత్తగా, అతన్ని అనుసరిస్తూ కొంత మంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరతీసినట్లు అయ్యింది. ఫ్రాన్స్‌ ప్రధాని ఎమాన్యుయెల్‌ మక్రాన్‌, అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అతిథుల తో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్‌పాస్ట్‌కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఫ్యాషన్‌ కు పెట్టింది పేరు అయిన పారిస్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అంతకుముందు జరిగిన షోలో పలువురు క్రీడా ప్రముఖులు తమదైన శైలిలో దుస్తులు ధరించి ఈఫిల్‌ టవర్‌ ముందు ఫొటోలు ఫోజులు ఇచ్చారు.

ఒలింపిక్స్‌కు ఆద్యులైన గ్రీస్‌ దేశంతో ఒలింపిక్స్‌ మార్చ్‌పాస్ట్‌ మొదలైంది. ఆరు కిలోమీటర్ల దూరమైన పరేడ్‌ అస్ట్రేలిట్జ్‌ బ్రిడ్జ్‌ నుంచి మొదలైంది. సీన్‌ నదికి ఇరువైపులా ఉన్న అతిథులు, అభిమానులకు అభివాదం చేస్తూ ఆయా దేశాల ప్లేయర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవల్లో ముందుకు సాగారు. తమ దేశ జాతీయ జెండాలను చేతబూని ఈలలు, కేరింతలు, హర్షధ్వానాలతో అలరించారు. గ్రీస్‌ తర్వాత ఐవోసీ రెఫ్యూజీ టీమ్‌ వరుస క్రమంలో వచ్చింది. ఫ్రెంచ్‌ అక్షర క్రమాన్ని అనసరిస్తూ ఆయా దేశాలకు చెందిన అథ్లెట్లు తమకు ఏర్పాటు చేసిన పడవల్లో ప్రయాణించారు. భారత్‌ తరఫున సింధు, శరత్‌ కమల్‌ పతకాధారులుగా వ్యవహరించారు.

85 బోట్లు, 6800 మంది అథ్లెట్లు: సీన్‌ నదిని ఆధారంగా చేసుకుంటూ ప్రముఖ అర్టిస్టిక్‌ డైరెక్టర్‌ థామస్‌ జాలీ ప్రారంభ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. మొత్తం 85 బోట్లు 6800 మంది అథ్లెట్లను మోసుకుంటూ ముందుకు సాగాయి. ఇందులో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు, సహాయక సిబ్బంది, అధికారులు ఉన్నారు. చారిత్రక క్యాథ్రడెల్‌ నోట్రె డేమ్‌ ద్వారా బోట్లు ప్రయాణించాయి. ఓవైపు వరుణుడు అంతరాయం కల్గించినా ఏ మాత్రం జోష్‌ తగ్గకుండా ఆటగాళ్లు చిరునవ్వుతో ముందుకు సాగారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events