శ్రవణ్‌రెడ్డి, రియా కపూర్ ప్రధాన పాత్రల్లో దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో శ్యామ్ దేవభక్తుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అజయ్ ఘోష్ క్లాప్‌నివ్వగా, సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విఛాన్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామాగా ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అఖిల్‌దేవ్, సంగీతం: సాహిత్య సాగర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసుదేవ్ పిన్నమరాజు.


