
ఖమేనీ మరణంతో ఇరాన్ సుప్రీం పదవికి మరొకరిని నియమించే ప్రయత్నాలు ఆ దేశంలో జోరుగా జరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక హెచ్చరిక చేశారు. టెహ్రాన్ కనుక తన అనుమతి లేకుండా ఇరాన్ సుప్రీంను నియమిస్తే అతను ఎక్కువ కాలం ఉండడు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ మా అనుమతి లేకుండా ఆయన ఎక్కువ కాలం కొనసాగలేడు. మేము ప్రతి 10 సంవత్సరాలకు ఇదే సమస్యతో రావాల్సిన పరిస్థితి లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాలాంటి అధ్యక్షుడు లేని సమయంలో కూడా అది జరగకపోవచ్చు అని అన్నారు.















