Namaste NRI

గాయపడ్డ సింహం టీజర్‌ వచ్చేసింది

తరుణ్‌భాస్కర్‌, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గాయపడ్డ సింహం. ఈ చిత్రానికి కాశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, అమెరికా వీసా కష్టాలను ఆవిష్కరిస్తుందని తరుణ్‌భాస్కర్‌ తెలిపారు. లాఫ్‌ రైడ్‌లా సినిమా సాగుతుందని ఫరియా అబ్దుల్లా చెప్పింది. వినోదంతో పాటు సందేశం కలబోసిన చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలన్నది అతని కోరిక. చివరకు ఎట్లాగో అమెరికాలో అడుగుపెడతాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేపట్టిన డిపోర్టేషన్‌ ఆపరేషన్‌ అతనికి సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ యువకుడి అమెరికా డ్రీమ్స్‌ ఏమయ్యాయే తెలుసుకోవాలంటే మా గాయపడ్డ సింహం చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌. ఈ వేసవిలో విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్‌ ఆగస్తీ, నిర్మాణం: సప్తస్వ మీడియా వర్క్స్‌, పీఓవీ స్టోరీస్‌, జీ స్టూడియోస్‌, రచన-దర్శకత్వం: కాశ్యప్‌ శ్రీనివాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events