Namaste NRI

ఇంకా తొలగని ముప్పు..డిసెంబర్‌లో 10 వేల మంది

 ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘెబ్రెయెస్ అన్నారు. ప్రపంచ దేశాల్లో పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ పెద్ద ముప్పుగా మారిందని చెప్పారు. ఒక్క డిసెంబరు నెలలోనే కరోనా మహమ్మారి వల్ల 10 వేలమందికిపైగా మరణించారని తెలిపారు. క్రిస్మస్ సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిందని వెల్లడించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌ దేశాల్లో అధికంగా ఉందన్నారు.

ఈ వైరస్ వల్ల గతేడాది నవంబర్‌ నెలలో దవాఖానల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన వారి సంఖ్య 42 నుంచి 62 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. కొవిడ్ వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. కరోనా పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాలను కోరారు. వైరస్‌పై నిఘా వేసి సీక్వెన్సింగ్ నిర్వహించాలన్నారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు టీకాలు వేయించుకోవాలని, పరీక్షలు చేయించుకోవడంతోపాటు ముందుజాగ్రత్తగా మాస్కులు ధరించాలన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events