
సామాజిక అసమానతలను రూపుమాపాలనే సందేశంతో తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం దండోర. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ ముఖ్య పాత్రధారులు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సినిమా నుంచి దండోరా దండోరా అనే టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ గీతానికి మార్క్ కె రాబిన్ స్వరాల్ని సమకూర్చారు. ఆంథోని దాసన్, మార్కె కె రాబిన్ ఆలపించారు. ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నది.















